Don't Miss!
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
#JaganShouldApologizeJrNTR వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలి.. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి వైసీపీ నేతలు, మంత్రి అంబటి రాంబాబు గురయ్యారు. తాజాగా చంద్రబాబు, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌పై మంత్రి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అంబటి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్స్‌పై దాడికి దిగడం భారీ చర్చకు దారి తీసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
అంబటి రాంబాబు నోటి దురుసు అంటూ
రాజకీయ విమర్శల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌పై మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసును వెళ్లగక్కారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు మంత్రి అంబటిపై భగ్గుమంటున్నారు.
|
జూనియర్ ఎన్టీఆర్ బోనియర్ ఎన్టీఆర్ అంటూ
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ను విమర్శలు గుప్పించారు. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి.. జూనియర్ ఎన్టీఆర్ కాదు.. బోనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేశారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ట్వీట్లు, ట్రోల్స్‌తో ఊగిపోతున్నారు. #JaganShouldApologizeJrNTR అనే ట్యాగ్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించేలా
జూనియర్ ఎన్టీఆర్‌ను మంత్రి అంబటి రాంబాబు అవమానించే విధంగా మాట్లాడానికి సందర్భం ఏమిటంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి మీడియాలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు లోకేష్. ఇది మేము అంటున్న మాట కాదు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అని మంత్రి రాంబాబు నోటి దురుసును బయటపెట్టుకొన్నారు. దాంతో ఆయన ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.
|
మహిళతో అంబటి అసభ్య వీడియో
అయితే జూనియర్ ఎన్టీఆర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఓ మహిళతో అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్లో లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు జరుగుతున్నాయి. అంబటి వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
మైలేజ్ కోసం ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలా?
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరికలు చేస్తున్నారు. మాటలు మర్యాదగా రానివ్వు.. మీ రాజకీయ మైలేజ్ కోసం ప్రాసల కోసం రాజకీయాలకు దూరంగా ఉంటున్న అతన్ని లాగి ఇష్టం వచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకునేది లేదు. ఎంతకు అంత తిరిగి ఇచ్చేస్తాం.. అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.
వైఎస్ జగన్ క్షమాపణ చెప్పు అంటూ
ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా తెనాలిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మధ్య ఇటీవల భారీ గొడవ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులు తెనాలిలో ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నిస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకొన్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌కు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.