జూ ఎన్టీఆర్ పరువు తీశావ్...నీ జిమ్మడ!
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కమల్ తనయ శృతి హాసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ అభిమానులు శృతిపై ఇలా అగ్గిమీద గుగ్గిలం అవడానికి కారణం 'దమ్ము" సినిమా నుంచి తప్పుకోవడమే. ఇది చాలా పాత విషయమే కాదా అనుకుంటున్నారా? తాజాగా వీళ్లు ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి మరో కారణం ఉంది.
తాజాగా శృతి మీడియాతో మాట్లాడుతూ 'దమ్ము" సినిమా టాపిక్ తీసింది. తాను డేట్లు అడ్జెస్ట్ కాక పోవడం వల్లనే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని, అంతకు మించి వేరే కారణం ఏదీ లేదని వివరణ ఇచ్చింది. అయితే మీడియాలో మరో రకంగా ప్రచారం జరుగుతుండటంపై శృతి అసహనం వ్యక్తం చేసింది. తనను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని వార్నింగ్ ఇచ్చింది.
అయితే.. శృతి ప్రకటనపై జూనియర్ అభిమానులు మండి పడుతున్నారు. అప్పుడు మా హీరో పరువు పోయే పని చేసి, ఇప్పుడేమో సొల్లు కబుర్లు చెబుతున్నావా? నీ జిమ్మడ అంటూ చిటపటలాడుతున్నారు. నువ్వెందుకు తప్పుకున్నావో? ఎవరి కోసం మా నందమూరి చిన్నోడికి హ్యాండ్ ఇచ్చావో ? మాకు తెలుసు, నీ సొల్లు కబుర్లు నమ్మడానికి మేము సిద్దంగా లేము అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











