ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీరుపై పవర్ స్టార్ ఫ్యాన్స్ గరం...
హైదరాబాద్: ఆ మధ్య మెగా అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఈ గొడవలు సినిమాలకు సంబంధించిన విషయాలపై ఉండేది. కానీ తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఈ గొడవలు రాజకీయ రంగును సంతరించుకుంటున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. జూ ఎన్టీఆర్‌ను కాదని....తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు పవన్ కళ్యాణ్‌ను నెత్తినెక్కించుకోవడం ఎన్టీఆర్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన ఇందుకు అద్దం పడుతోంది.

నల్లగొండ జిల్లాలని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న వంగల స్వామీగౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోస్టర్లు అచ్చువేయించారు. దీనిపై చంద్రబాబుతో పాటు, పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ముద్రించారు. అయితే ఈ పోస్టర్లపై జూ ఎన్టీఆర్ ఫోటో లేక పోవడంపై స్థానికంగా ఉండే జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోయారు.
పోస్టర్లపై జూ ఎన్టీఆర్ ఫోటో వేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కేడర్‌తో గొడవకు దిగారు. పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న పోస్టర్లను మీడియా ముందే చించేసారు. జూ ఎన్టీఆర్ అభిమానుల గొడవతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ పోస్టర్లను చించి వేయడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











