సెంటిమెంట్ తో పనిగట్టుకొని నన్ను కొడతారు: జూ ఎన్టీఆర్
'ఆది" చిత్రంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 'సింహాద్రి", 'అదుర్స్" సినిమాల్లో కూడా ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆ సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి. దాంతో జూఎన్టీఆర్ గాయపడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలపడింది. తాజాగా 'బృందావనం" షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ గాయపడ్డాడు. దాంతో ఈ సినిమా కూడా బాక్సాపీస్ వద్ద విజయం సాధించడం గ్యారంటీ అనే సెంటిమెంట్ బలపడింది. ఇలా అయితే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సన్నివేశంలో నన్ను గాయపరచడానికి ఫైట్ మాస్టర్లు పనిగట్టుకొని మరి ట్రై చేస్తారు అని ఇటీవల జరిగిన 'బృందావనం" ఆడియో ఫంక్షలో జూ ఎన్టీఆర్ నవ్వుతూ జోకులేసాడు.


Click it and Unblock the Notifications











