‘బాద్‌షా’ చూసిన తర్వాత ఎన్టీఆర్ రియాక్షన్ ఇలా..
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా స్పెషల్‌లో ఇప్పటికే వీక్షించిన ఎన్టీఆర్....సినిమా ఔట్ పుట్‌పై చాలా సంతోషంగా ఉన్నాడట. ఆయన సన్నిహితుల నుంచి అందని సమాచారం ప్రకారం తన గత సినిమాలన్నింటికంటే ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారట జూనియర్.

జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. 'బృందావనం' సినిమా తర్వాత జూనియర్ హిట్ మొహం ఎరుగలేదు. బృందావనం తర్వాత వచ్చిన శక్తి బాక్సాఫీసు వద్ద భారీ అపజయాన్ని చవిచూడగా, ఊసరవెల్లి చిత్రం కూడా హిట్ రేంజిని అందుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'దమ్ము' చిత్రం అంచనాలను తారుమారు చేస్తూ బోల్తా పడింది.
ఇలా వరుస అపజయాలతో కసిగా ఉన్న జూ ఎన్టీఆర్...హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టి హిట్ కొట్టాలనే కసి 'బాద్ షా' చిత్రంతో తీర్చుకున్నాడనే చెప్పాలి. ఈచిత్రం కోసం తాను గతంలో ఎన్నడూ లేని విధంగా కష్ట పడ్డానని, కాస్టూమ్స్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి అంశంలోనూ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని జూనియర్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిదే.
'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











