twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ న్యూ అండ్ ఫస్ట్ లుక్ దమ్ము

    By Bojja Kumar
    |

    యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కలగలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆ మధ్య ఎన్టీఆర్ కోరమీసాలతో కనిపించడంతో అంతా ఆశ్యర్య పోయారు కూడా. ఇది సినిమాలో యాక్షన్ పార్టుకు సంబంధించిన గెటప్ కావొచ్చని అంతా భావించారు. తాజాగా జూ ఎన్టీఆర్ 'దమ్ము'కు సంబంధించిన ఫోటో రిలీజైంది. ఇందులో జూనియర్ గత సినిమాల్లో కంటే చాలా స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. పక్క ఫోటోలో చూస్తుంది 'దమ్ము' సినిమాకు సంబంధించిన ఫోటోనే. దీన్ని బట్టి బోయాపటి జూ ఎన్టీఆర్ ఈ సారి డిఫరెంట్ రోల్స్ లో చూపించబోతున్నాడని అంతా చర్చించుకుంటున్నారు.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని గచ్చిబౌలి సాగుతోంది. ఇక్కడి అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు బోయపాటి జూనియర్ తో అదిపోయే స్టంట్స్ చేయిస్తున్నాడు. దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా...కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శక్తి లాంటి మెగా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా తన పేరును నిలబెట్టే సినిమాగా నిలుస్తుంది జూనియర్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

    English summary
    Jr NTR Upcoming film Dammu under the direction of Boyapati Srinu.Now the latest news is that,the stunning NTR first look in Dammu Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X