»   »  షాకింగ్ : సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ (ఫోటో)

షాకింగ్ : సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో జూ ఎన్టీఆర్ ఏ కార్యక్రమానికి హాజరైనా భారీ గడ్డంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జుట్టు కూడా భారీగానే పెంచుతున్నాడు. అయితే ఇదంతా సుకుమార్ సినిమాలోని గెటప్ కోసమేనంట. జూ ఎన్టీఆర్ గెటప్ ఇపుడు ఎలా ఉందో మీకూ ఓ లుక్కేయండి మరి. ఈ చిత్రానికి‘ప్రేమతో మా నాన్నకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Jr NTR First Look in Sukumar Film!

సినిమా వివరాల్లోకి వెళితే..
ఇటీవల యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు వివరాలు అఫీషియల్ గా విడుదల చేసారు. సుకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ విషయమై నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్ కి మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్నిఇచ్చారు అని తెలిపారు.

జూన్ నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, సాహసం, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ తో కలిసి చేస్తున్న మరో భారీ చిత్రమిది అని బివిఎస్ఎన్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Jr NTR First Look in Sukumar Film out. The project which is ought to have been initiated with location scouting in Europe will have a new and unseen look from Junior NTR.
Please Wait while comments are loading...