‘దమ్ము’ చూపించడానికి బిజీ అవుతున్న జూ ఎన్టీఆర్.!?

By Sindhu

జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి నుంచి బయటికొచ్చి ఇప్పుడు 'దమ్ము" షూటింగ్ లో బిజీ అయిపోయాడు. శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యిన ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది. 'ఊసరవెల్లి" షూటింగ్ లో ఎన్టీఆర్ కి గాయం కావడం వల్ల కొంత డిలే అయింది. ఇంతకు ముందు రెండు షెడ్యుళ్ల షూటింగు జరిగిన సంగతి తెలిసిందే. ఆ షూటింగులో యన్టీఆర్, శృతి హాసన్ లపై రొమాంటిక్ సన్నివేశాలు; యన్టీఆర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీలపై యాక్షన్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. 'ఊసరవెల్లి' సినిమా రిలీజైపోవడంతో యన్టీఆర్ ఇక పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టాడు.

'సింహా" వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. శతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. కాగా, ఇందులో సెక్సీ నమిత ఓ ఐటెం సాంగ్ చేయనుందని తెలుస్తోంది. యన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.జనవరి వరకు జరిగే షూటింగ్ తో సినిమా కంప్లీట్ అవుతుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X