twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతోందిగా.!

    By Manoj
    |

    భారతదేశంలో సినిమా స్టార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత సంఘటనలు ఇక్కడ జరుగుతుంటాయి. తమకు ఇష్టం అయిన నటీనటుల పట్ల అభిమానం చాటుకునేందుకు చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు, మన దేశంలోనే చాలా చోట్ల తమ అభిమాన నటులను దేవుళ్లుగా కొలిచే సంప్రదాయం కూడా ఉంది. గతంలో కొందరు నటులకు గుడి కట్టిన సందర్భాలు కూడా చూశాం. తాజాగా టాలీవుడ్ హీరోకు చెందిన అభిమానులు ఓ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..

    టాలీవుడ్‌లో ఎంతో మంది ఉన్నారు

    టాలీవుడ్‌లో ఎంతో మంది ఉన్నారు

    ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నందమూరి బాలకృష్ణ, అక్కినేని సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ సహా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు తమకు తోచిన రీతిలో పేదలకు సాయం చేస్తూనే ఉన్నారు. దీనికితోడు విపత్తుల సమయంలో విరాళాలు ఇస్తున్నారు.

    తారక్ కూడా చాలా చేశాడు

    తారక్ కూడా చాలా చేశాడు

    తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గతంలో ఎన్నో సందర్భాల్లో తారక్ సేవా కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా విపత్తుల సమయంలో ఆయన భారీ మొత్తం విరాళంగా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే, కొన్ని చారిటబుల్ ఈవెంట్స్‌కు తన వంతు సహాయం అందించాడు.

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ బృహత్తర కార్యం

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ బృహత్తర కార్యం

    తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన నిస్సహాయులకు సేవలు అందించేందుకు ‘ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్' పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    తారక్ వస్తున్నాడా.?

    తారక్ వస్తున్నాడా.?

    ఈ ట్రస్టును ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు కానీ, ప్రస్తుతం ఇది తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. అలాగే, దీనిని గ్రాండ్‌గా ఓపెన్ చేస్తారా.? చేస్తే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
     అక్కడ బిజీగా ఉన్న ఎన్టీఆర్

    అక్కడ బిజీగా ఉన్న ఎన్టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

    English summary
    Nandamuri Taraka Rama Rao Jr., also known as Jr. N.T.R or Tarak, is an Indian film actor, Kuchipudi dancer, playback singer and television personality known for his works in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X