బన్నీ బద్రినాథ్ కు ధీటుగా జూ ఎన్టీఆర్ రికార్డ్ బిజినెస్...!?
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత బివిఎస్ ఎప్ ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'ఊసరవెల్లి" అనే టైటిల్ ప్రచారంలో వున్న ఆ సినిమాలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అన్ని ఏరియాలు అమ్ముడు పోయి సంచలనం సృష్టిస్తోంది.
ఆంధ్రా రీజియన్ కు గానూ 15కోట్లు, రాయలసీమకుగాను 8కోట్లు, ఇకనైజామ్ ఏరియాకు గాను 8కోట్లు. ఇవికాకుండా మిగతా ఏరియాలకు కలిపి 12కోట్లు మొత్తం కలిపి 43 కోట్లు వసూలు చేసి తెలుగు చలన చిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలీజ్ కు ముందే ఈ స్థాయిలో వసూలు చేస్తే ఇక రిలీజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో..అందుకు గాను జూ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ నా సినిమా మీద, నా మీద నమ్మకం పెట్టినందుకు చాలా సంతోషం అని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











