జూ ఎన్టీఆర్ ని పరామర్శించిన సినీ ప్రముఖులు
జూనియర్ ఎన్టీఆర్ అమ్మమ్మ ఇందిరాభాస్కరరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిర వారం రోజులుగా హైదరాబాద్ మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిన ఇందిర దంపతులకు తొమ్మిదిమంది సంతానం కాగా, వారిలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని మూడో కుమార్తె. దివంగత నటుడు రాజా ఇందిర చివరి కూతురు భర్త. ఇందిర భౌతికకాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు కల్యాణ్‌రామ్ సందర్శించారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, డి. సురేశ్‌బాబు, మెహర్ రమేశ్, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, గణేశ్, వంశీ పైడిపల్లి, రాజీవ్ కనకాల, తదితరులు ఆమెకు నివాళులు అర్పించి..జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.
జూ ఎన్టీఆర్ ఇందిరా భాస్కరరావు మెడిసిటీ శాలిని హరికృష్ణ కళ్యాణ రామ్ shalini indira jr ntr bhaskar rao harikrishna kalyan ram


Click it and Unblock the Notifications