బాలయ్య ఇంట్లో పెళ్లి: ఎన్టీఆర్, హరికృష్ణ గైర్హాజరు
హైదరాబాద్ : టాలీవుడ్ సినీహీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో బుధవారం ఉదయం 8.52 గంటలకు హైటెక్ప్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక బాలయ్య అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ పెళ్లిలో హరికృష్ణ,జూ.ఎన్టీఆర్ ఇద్దరూ హాజరుకాలేదు. అయితే కళ్యాణ్ రామ్ ఉత్సాహంగా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. దాంతో ఎన్టీఆర్ కు వివాహ ఆహ్వానం పంపలేదని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకను పురస్కరించుకుని నందమూరి కుటుంబసభ్యులతోపాటు, తెలుగు సినిమా కుటుంబానికి చెందిన వారంతా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, కృష్ణం రాజు, మంచు మనోజ్, పరుచూరి బ్రదర్స్, అలీ, రోజా, మంచు లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, తరుణ్, శివాజీ రాజా, సినీ నిర్మాత రామోజీరావు, హీరో ఉదయ్ కిరణ్, కళ్యాణ్ రామ్, రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు.
ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. వివాహ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జైపాల్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ రోశయ్య, 'ఈనాడు' ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, తేదేపా నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంబికాకృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, బీజేపీ నేత నేత బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications












