పవన్ దర్శకుడితో జూ ఎన్టీఆర్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హారిష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే హారిష్ శంకర్ జూనియర్ కు కథ వినిపించాడని, కథ నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. బహుషా ఈ సినిమా 2012 సంవత్సరంలో సెట్స్ మీదనకు వచ్చే అవకాశం ఉంది.
ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులైన టీడీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకు వీరు జూనియర్ తో అదుర్స్ సినిమా రూపొందించారు. ప్రస్తుతం జనియర్ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో 'దమ్ము" సినిమా చేస్తుండగా, హారిష్ శంకర్ వపన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తూంది.


Click it and Unblock the Notifications










