ఎన్టీఆర్ సినిమాపై హరీష్ శంకర్ స్సెషల్ అనౌన్స్‌మెంట్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ జనవరి నెలలో ప్రారంభం కానుంది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ఈ రోజు స్పెషల్ డే(12/12/12)ను పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా షూటింగ్ వివరాలను ప్రకటించారు.
'ఈ రోజుకు ఎంతో స్పెషాలిటీ ఉంది. ఈ సందర్భంగా నేను స్పెషల్‌గా ప్రకటిస్తున్న విషయం ఏమిటంటే..... యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మా సినిమా షూటింగ్ ప్రారంభించడానికి డేట్స్ ఇచ్చారు. జనవరి 3 నుంచి 15 వరకు తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. మేము అంతా సిద్దంగా ఉన్నాం. ఎనర్జిటిక్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడానికి మా టీం అంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోంది' అంటూ... హరీష్ శంకర్ తన ట్విట్టర్లో ప్రకటించారు.
'మై బ్రదర్ శ్రీను వైట్ల, నిర్మాత బండ్ల గణేష్‌లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి సినిమా (బాద్ షా) షెడ్యూల్స్ పూర్తికాక ముందే మా సినిమాకు యంగ్ టైగర్ డేట్స్ ఇచ్చేలా సహకరించినందుకు థాంక్స్' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











