జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ మూవీ ఓపెనింగ్(ఫోటోస్)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం ఓపెనింగ్ పూజా కార్యక్రమం గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కార్యాలయంలో జరిగింది. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై హరీష్ శంకర్ చిత్రీకరించిన తొలి షాట్ కు ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేస్తారు.
హరీష్ శంకర్ ఇది వరకు 'గబ్బర్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హీరోగా జూ ఎన్టీఆర్ స్టామినా ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరున్న దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

ఎన్టీఆర్ దేవుడి చిత్ర పటాలపై చిత్రీకరించిన షాట్‌కు క్లాప్ ఇచ్చారు. ప్రొడక్షన్ నెం.16గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

తొలి సన్ని వేశానికి దిల్ రాజు కెమెరా స్విచాన్ చేసారు. ఈ రోజు మధ్యాహ్నం 1.40 నిమిషాలకు ఈ కార్యక్రమం జరిగింది. చిత్రంలోని గడియారంలో సమయం చూడొచ్చు.

కార్యక్రమం ముగిసిన అనంతరం జూ ఎన్టీఆర్, దిల్ రాజు, హరీష్ శంకర్, తమన్, చోటా కె.నాయుడు తదితరులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











