జూ ఎన్టీఆర్-హరిష్ శంకర్ మూవీ ల్యాంకో హిల్స్
హైదరాబాద్: 'బాద్ షా'తో భారీ విజయం చవి చూసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా షూటింగులో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ల్యాంకో హిల్స్ సమీపంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఉండనుంది.
గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అతనితో పని చేయడంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. పంచ్ డైలాగులకు తోడు వపర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ లాంటి విషయాల్లో హరీష్ శంకర్‌కు మంచి నైపుణ్యం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











