అభిమానులను టార్గెట్ చేసిన జూ ఎన్టీఆర్!

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నుంచి హిట్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా 'దమ్ము' చిత్రం విడుదలై కూడా ఎనిమిది నెలలు గడిచి పోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా నందమూరి చిన్నోడి సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు.

దీంతో అభిమానుల కోరిక తీర్చడమే టార్గెట్‌గా పెట్టుకున్న ఎన్టీఆర్ వరస సినిమాలకు సైన్ చేసి స్పీడ్ పెంచాడు. ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తున్న ఎన్టీఆర్.... మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. బాద్ షా చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా, హరీష్ శంకర్ తో చేస్తున్న చిత్రం కొన్నిరోజుల క్రితం లాంఛనంగా ప్రారంభం అయింది.

హరీష్ శంకర్ తో చేయబో చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 3 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

బాద్ షా చిత్రం వివరాల్లోకి వెళితే...
ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X