పరువు కోసం?...జూ ఎన్టీఆర్‌‌-హరీష్ శంకర్ మళ్లీ!

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ వైఫల్యం వల్లనే సినిమా బాక్సాఫీసు రేసులో పరాజయం పాలైందనే టాక్ స్ర్పెడ్ అయింది.

జూ ఎన్టీఆర్‌ ఖాతాలో అపజయాన్ని చేర్చాడనే అపఖ్యాతి మూటగట్టుకున్నాడు హరీష్ శంకర్. దీంతో పరువు పోయినట్లు ఫీలవుతున్న ఆయన....జూ ఎన్టీఆర్‌తో మరో సినిమా చేసి పరువు పోయిన చోటే తలెత్తుకుని తిరగాలనే నిర్ణయానికి వచ్చాడు. జూ ఎన్టీఆర్‌తో మరో సినిమా చేసి తన సత్తా చాటుకుంటానని అంటున్నాడు హరీష్ శంకర్.

Jr NTR and Harish Shankar

'రామయ్యా వస్తావయ్యా' చిత్రంపై సినీ విమర్శకులు, ప్రేక్షకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్నాని, సినిమాలో తాను ఏమి మిస్ చేసానో గ్రహించానని ఒప్పుకున్న హరీష్ శంకర్...త్వరలోనే జూ ఎన్టీఆర్‌తో మరో సినిమా చేస్తానని, ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ చేర్చి తన సత్తా చాటుకుంటానని అంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని ఆయన తెలిపారు.

'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు. నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌‍పై దాదాపు రూ. 35 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా డివైడ్ టాక్ వచ్చినా...బిజినెస్ పూర్తయ్యేలోపు పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందనే నమ్మంతో ఉన్నారు నిర్మాత. ఇప్పటి వరకు ఈచిత్రానికి 25 కోట్ల పైనే షేర్ వసూలైట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X