ఆదర్శంగా నిలిచిన యంగ్ టైగర్.. కష్టకాలంలో తోడుగా.. ఎన్టీఆర్‌కు నెటిజన్ల హ్యాట్సాఫ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినని, తెలియన తెలుగు సినీ ప్రేక్షకులుండరు. సినిమాల పరంగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో.. అభిమానులు, ప్రజల పట్ల ప్రేమను కనబరుస్తూ అంతకు మించి మంచి పేరును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ పరిణతి సాధిస్తున్నాడు. కష్టకాలంలో తనను నమ్ముకున్నవారికి సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

 సీసీసీకి విరాళం..

సీసీసీకి విరాళం..

కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా ఉండేందుకు సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ)ని ఏర్పాటు చేశారు. సీసీసీ సినీ హీరోలంతా ఆర్థిక సాయం చేశారు. ఎన్టీఆర్ సైతం రూ. 25లక్షల రూపాయలను సినీ శ్రామికుల కోసం అందించాడు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్థిక విరాళం ఇచ్చాడు.

వ్యక్తిగత సిబ్బందికి..

వ్యక్తిగత సిబ్బందికి..

సీసీసీకి విరాళం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మరో సాయం చేసి వార్తల్లో నిలిచాడు. తనను నమ్ముకొని పనిచేస్తున్న టీం సభ్యులు వారి కుటుంబాల బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. వారి మొత్తం బాగోగులు లాక్ డౌన్ ముగిసే వారకు తానే తీసుకుంటానని ప్రకటించాడు.

అందరికీ వేతనాలే కాకుండా..

అందరికీ వేతనాలే కాకుండా..

లాక్ డౌన్ వేళ వారందరికీ అత్యధిక వేతనం.. రాబోయే రోజుల్లోనే ఏ ఆపద వచ్చినా తనే చూసుకుంటానని తన దగ్గర పనిచేసే వారిందరికీ ఎన్టీఆర్ హామీ ఇచ్చారట. ఇలాగే హీరోలంతా తమను నమ్మకుని సిబ్బందిని చూసుకుంటే ఎంతో మంది కడుపునిండుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్యాన్ ఇండియా స్థాయిలో..

ప్యాన్ ఇండియా స్థాయిలో..

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్యాన్ఇండియా స్థాయిలోనే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకులతో ఎన్టీఆర్ పని చేయబోతోన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉన్నాడు. ఆపై మాటల మాంత్రికుడు చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X