For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వావ్ వకీల్ సాబ్... పవన్ కల్యాణ్‌ను హగ్ చేసుకున్న ఎన్టీఆర్!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా మొన్న శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉగాది పండుగ రోజు కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఒకరకంగా కలెక్షన్స్ లో ఏ మాత్రం డ్రాప్ లేకుండా వకీల్ సాబ్ సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తున్నా సరే జనం ఏ మాత్రం భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పవర్ స్టార్ సినిమా కోసం క్యూ కడుతున్నారు. అందుకే నిన్న ఉగాది అంటే ఐదో రోజు కూడా అన్ని సెంటర్ల వద్ద జనాలు సందడి కనిపించింది.

  లాక్ డౌన్ తర్వాత మొదటి సినిమాగా రికార్డు

  లాక్ డౌన్ తర్వాత మొదటి సినిమాగా రికార్డు

  విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల అంశంతో కాస్త వెనుకబడి ఉన్నా మిగతా ప్రాంతాల్లో వసూళ్లు బాగానే చేస్తోంది. సోమవారం నాడు కాస్త డ్రాప్ కనిపించినా సరే నిన్న ఉగాది సెలవు కావడంతో మళ్లీ వసూళ్లు పుంజుకున్నాయి. యువతకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తెరకెక్కిన ఈ సినిమాకు యువత నుంచి మహిళల నుంచి అలాగే అన్ని వయసుల వారి నుంచి మంచి స్పందన లభిస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అలాగే లాక్ డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు నమోదు చేసింది..

  అయితే అసలు విషయానికి వస్తే

  అయితే అసలు విషయానికి వస్తే

  అయితే అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాదిస్తున్న కేసుకు వ్యతిరేకంగా వాదించే క్రిమినల్ లాయర్ నంద పాత్రను ప్రకాష్ రాజ్ పోషించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇది ఒక సామాజిక కోణంలో తీసిన సినిమా కాబట్టి యూనిట్లో ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఎఫెక్ట్స్ పెట్టి పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అంత బాధ్యతగా పని చేశారు కాబట్టే ఈ సినిమాకి ఇప్పుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

  పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్న ఎన్టీఆర్

  పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్న ఎన్టీఆర్

  మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని పేర్కొన్న ఆయన ఈ సినిమా పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్నాడు అని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడూ ఏ సందర్భంలో అనేది చెప్పలేదు. కానీ వెంటనే మహేష్ బాబు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారని అన్నారు. ముగ్గురు ఆడ పిల్లలకు సంబంధించి చేసిన సినిమా అని ప్రకాష్ రాజ్ నటన కూడా బాగుందని ప్రశంసించారు అని ఆయన గుర్తు చేశారు.

  #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 3 | Pawan Kalyan | Venu Sriram
  వకీల్ సాబ్ స్పెషల్ స్క్రీనింగ్ లో

  వకీల్ సాబ్ స్పెషల్ స్క్రీనింగ్ లో

  అయితే ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం వకీల్ సాబ్ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరు అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు కొంతమంది సన్నిహితులకు ఈ సినిమా స్క్రీనింగ్ వేశారని ఆ స్క్రీనింగ్ లో భాగంగా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమా చూశాడని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే భావోద్వేగాలను ఆపుకోలేక వెళ్లి పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ హగ్ చేసుకున్నాడని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న రాజకీయ విభేదాల గురించి కూడా ప్రకాష్ రాజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  English summary
  Pawan Kalyan’s Vakeel Saab is being applauded for its huge success by tollywood biggies. It is also performing quite well at the box office. Recently prakash raj who played an important role in Vakeel Saab made an interesting comment while speaking in a promotional interview. “Jr NTR hugged Pawan Kalyan after watching the film very recently,” Prakash Raj said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X