తాత గెటప్ లో ఎన్టీఆర్

By Staff

Jr Ntr
అప్పట్లో తెలుగుదేశం స్థాపించి ఖాకీ డ్రెస్సుతో చైతన్యరథంపై జనంలోకి వెళ్లిన తాత మాదిరే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా రోడ్‌ షోలకు హాజరవనున్నారని సమాచారం. అలాగే మొత్తం తన తాత మాదిరిగానే ప్రసంగాలు, డైలాగులు ఉండేలా ఆయన తన ప్రసంగాలను సిద్ధం చేసుకుంటున్నారు. తన తాత ఎన్టీఆర్‌ వేషధారణలోనే వెళితే ఆ గుర్తింపే వేరని ఆయన భావిస్తున్నారు. ఈ నెల 11నుంచి మొదలుకానున్న రోడ్ షో లకు షెడ్యూలు ఖరారైంది. జూనియర్ మొదట ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి తాతకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయలుదేరతారు. విశాఖపట్నం వరకు విమానంలో వెళ్లి అక్కణ్నుంచి 12వ తేదీ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇచ్ఛాపురం వెళతారు.

ఉదయం 10 గంటలకు ఇచ్ఛాపురంలో రోడ్‌షో ప్రారంభమవుతుంది. ఇక ఆ ఉపన్యాసాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన సామాజిక న్యాయం, రాష్ట్రంలో తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్‌ రగిలించిన స్ఫూర్తి, మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయేవి.. వీటితో పాటు స్థానిక సమస్యలను ఎన్టీఆర్‌ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావిస్తారని సమాచారం. ఇక ఇప్పటికే తాను పర్యటించబోయే అన్ని ప్రాంతాల పరిస్థితులు, స్థానిక సమస్యలు తదితరాలన్నింటిపై ఎన్టీఆర్ వివరాలు తెప్పంచుకుని అవగాహన పెంచుకున్నారు. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ చైతన్యరథం కూడా తయారైంది. ఇచ్ఛాపురంలో ప్రారంభమయ్యే జూనియర్‌ యాత్ర ఏకబిగిన 40రోజుల పాటు కొనసాగుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను ఈ యాత్ర సాగుతుంది.మరి తాత గెటప్ లో ప్రజల్లోకి వెళుతున్న ఎన్టీఆర్ ఏ మేరకు జనాకర్షణ పొందనున్నారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X