షూటింగ్ లో గాయపడ్డ జూ ఎన్టీఆర్ కి స్వల్పగాయాలు...?
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రసుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఊసరవెల్లి" అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ చివరిలో చిన్న అపశృతి చోటు చేసుకుందట. ఈ చిత్రం చివరి రోజు షూటింగ్ లో జూ ఎన్టీఆర్ స్వల్పంగా గాయాలయునట్టు తెలుస్తోంది. దాంతో హుటాహుటీన జూ ఎన్టీఆర్ ని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు గాయాలు చిన్నవేనని కానీ రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట.
గతంలో అదుర్స్ సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న సంగతి విధితమే. ఊసరవెల్లి షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఈ సినిమా ప్రకటించిన డేట్ కే విడుదలవ్వబోతుంది. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే దమ్ము షెడ్యూల్ కొంత వరకూ అప్ సెట్ అయ్యే అవకాశం ఉంది ఏమైనా జూ ఎన్టీఆర్ తర్వగా కోలుకోవాలని ఆశిద్దాం....
jr ntr oosaravelli surender reddy tamanna dammu boyapati srinu జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి సురేందర్ రెడ్డి తమన్నా దమ్ము బోయపాటి శ్రీను


Click it and Unblock the Notifications