ఓటమికి కృంగిపోని హీరో ఎన్టీఆర్
నిన్న ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయిన డ్యాన్స్ షో 'ఢీ-2' లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ముగ్గురు డ్యాన్సర్లు పోటీ పడుతున్న ఈ తుది సమరంలో శేఖర్ మాస్టర్ ఓటమి పాలయ్యారు. దీంతో ఉద్వేగం తట్టుకోలేక శేఖర్ కన్నీటిపర్యంతం అయ్యారు. అప్పుడు కలగజేసుకొన్న ఎన్టీఆర్ తనదైన శైలిలో ఆయన్ను ఓదార్చారు. 'ఓటమి విజయానికి తొలి మెట్టని' తన స్వీయానుభవాన్ని ఉదహరించారు. ఎంతో ఉత్సాహంగా తాను నటించిన తొలి చిత్రం 'నిన్ను చూసాక' సినిమా ఫ్లాప్ అయిందనీ, ఆ తర్వాత రెండు హిట్లు వచ్చాయి కానీ 'సింహాద్రి' తర్వాత వరుస పరాజయాలే తనని పలకరించాయనీ దీంతో నా కెరీర్ ఎంటీ అని ఆలోచించే వాడినని...ఆ తర్వాత వచ్చిన 'యమదొంగ'తో తిరిగి విజయం తనని వరించిందని, అప్పటి నుండీ ఓటమి విజయానికి తొలి మెట్టు అని భావిస్తున్నానని చెప్పాడు.
ఎంతో పెద్ద స్టార్ హీరో ఇలా తన సొంత పరాజయాల గురించి ప్రస్తావిస్తూ ఓదార్చడం ఈ కార్యక్రమం చూసిన వారందరినీ ఆకట్టుకొంది. ఎన్టీఆర్ పరిణతి చెందిన ఆలోచనలను ఇది సూచిస్తోందని ఆయన్ని పలువురు అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











