»   » ఆయన మాత్రమే లెజెండ్, నా త‌మ్ముడిని అలా పిలవొద్దు: క‌ల్యాణ్ రామ్

ఆయన మాత్రమే లెజెండ్, నా త‌మ్ముడిని అలా పిలవొద్దు: క‌ల్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూఎస్ఏ పర్యటనలో ఉన్న కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ గురించి స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది. తానా ఉత్సవాల్లో ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న అవార్డ్స్ వేడుక‌కు హాజరైన సందర్భంగా కళ్యాణ్ రామ్ ఈ కామెంట్స్ చేసారు.

అక్కడ కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌ను లెజెండ్ అంటూ నినాదలు చేయడంతో తన తమ్ముడిని అలా పిలవొద్దని వారిని వారించే ప్రయత్నం చేసారట. లెజెండ్ అనేది పెద్ద వాళ్లను ఉద్దేశించి వాడే పదం... నా తమ్ముడు ఇంకా చిన్న వాడే అని కళ్యాణ్ రామ్ చెప్పినట్లు సమాచారం.

పెద్ద ఎన్టీఆర్‌ మాత్రమే అర్హుడు

పెద్ద ఎన్టీఆర్‌ మాత్రమే అర్హుడు

లెజెండ్ అనే పదానికి తమ ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అర్హుడని కళ్యాణ్ రామ్ చెప్పినట్లు సమాచారం.

తమ్ముడు ఆటం బాంబ్

తమ్ముడు ఆటం బాంబ్

మరి మీ తమ్ముడు ఎలాంటి వ్యక్తి అని అభిమానులు అడగ్గా.... నా తమ్ముడు ఆటం బాంబ్ లాంటి వాడు అని కళ్యాణ్ రామ్ చెప్పడంతో..... జై ఆటం బాంబ్ అంటూ అభిమానులు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.

సొంత డబ్బులతో

సొంత డబ్బులతో

తానా లాంటి సభలకు వెళ్లినపుడు సినీ స్టార్ల ఖర్చులన్నీ తానా నిర్వాహకులే భరిస్తారు. అయితే కళ్యాణ్ రామ్ తన ఖర్చులు, తన వెంటన వచ్చిన వారి ఖర్చులు మొత్తం తాను సొంతగా పెట్టుకున్నాడట. తమ టికెట్‌లకు, పర్యటనకు ఖర్చు చేద్దామనుకున్న మొత్తాన్ని పూర్ పీపుల్ స్టడీస్ కు వాడమని తానా నిర్వాహకులను కోరాడట.

తమ్ముడితో సినిమా

తమ్ముడితో సినిమా

తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవ కుశ' చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Actor Kalyan Ram gets a warm welcome from members belonging to the Telugu NRI community TANA in Chicago in USA. Kalyan Ram has visited Chicago along with his family after almost a decade. He talked about his student days in Chicago at a Meet-n-Greet session with fans. He said He would do films which he likes from the bottom of his heart. Talking about his brother Jr.NTR he said , In one word NTR is an Atom Bomb.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu