twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా సిద్ధం చేసుకుని జూ. ఎన్టీఆర్ తిరిగొచ్చాడు.. ఎక్కువ భాగం ఇప్పుడే!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారు. సౌత్ ఇండియాలోనే ఇది భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిని మించేలా ఉండడానికి రాజమౌళి పెద్ద కసరత్తే చేస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ లుక్స్ డిఫెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. ఇటీవల జూ.ఎన్టీఆర్ షూటింగ్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.

    తిరిగొచ్చిన ఎన్టీఆర్

    తిరిగొచ్చిన ఎన్టీఆర్

    ఎన్టీఆర్ విరామం ముగించుకుని తాజగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది కేవలం వెకేషన్ మాత్రమే కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబందించి ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన కొన్ని కసరత్తులు కూడా దుబాయ్ లో జరిగాయట.

    ఇక గ్యాప్ లేదు

    ఇక గ్యాప్ లేదు

    ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ సిద్ధం చేసుకుని తిరిగి ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలని రాజమౌళి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఎక్కువరోజులపాటు గ్యాప్ లేకుండా నిర్విరామంగా కొనసాగుతుండడట. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించే సన్నివేశాలని రాజమౌళి ఈ షెడ్యూల్ లోనే ఎక్కువ భాగం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

     ఆసక్తికర ఊహాగానాలు

    ఆసక్తికర ఊహాగానాలు

    ఎన్టీఆర్ ఈ చిత్రంలో దొంగ పాత్రలో నటిస్తున్నాడని మాత్రమే ప్రచారం జరిగింది. అంతకు మించి ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. రాంచరణ్ పాత్రకు సంబంధించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రాంచరణ్ పేరు ఈ చిత్రంలో రామరాజు అని అంటున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా, మాస్ లీడర్ గా, ఫ్రీడమ్ ఫైటర్ గా మూడు కోణాల్లో రాంచరణ్ పాత్ర ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    బరువు పెరగనున్న ఎన్టీఆర్

    బరువు పెరగనున్న ఎన్టీఆర్

    ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తన పాత్ర కోసం కాస్త బొద్దుగా మారి కనిపిస్తాడట. అరవింద సమేతలో సిక్స్ ప్యాక్ లుక్ తో స్లిమ్ గా కనిపించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. అలియా భట్, పరిణీతి చోప్రా లాంటి హీరోయిన్ల పేర్లు ఈ చిత్రం కోసం వినిపిస్తున్నా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. డిడివి దానయ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు నిర్మాత. ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి కంటే భారీ స్థాయిలో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Jr NTR is back from vacation and Joined the shoot of RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X