జూ ఎన్టీఆర్ గురించి నాగార్జున ఓ టీవీ ఛానెల్ లో...
ఈ తరంలో ఉన్న నటుల్లో జూ.ఎన్టీఆర్ ని మించిన వారు లేరని మరో స్టార్ హీరో నాగార్జున స్పష్టం చేసారు. ఆయన తాజాగా ఓ టవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..జూ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న నటుడు అని అతనిచ్చే ఎక్సప్రెషన్స్ తనను ఉత్తేజపరుస్తాయన్నారు. అలాగే ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే విధానం పరిణితి ఉన్న ఆర్టిస్టులు మాత్రమే చెప్పగలిగేలా ఉంటుందన్నారు.ఎంత పెద్ద డైలాగునైనా చాలా సింపుల్ గా చెప్పటం అతని గొప్పతనం..ఈ జనరేషన్ లో అటువంటి నటులు అరుదుగా ఉంటున్నారని అన్నారు. ఇక యాక్షన్ సీన్ అయినా, ఇంటెన్స్ ఉన్న షాట్ అయినా, రొమాంటిక్ సన్నివేశం అయినా, ఎమోషన్ ల్ గా డెప్త్ గా చూపాలన్నా ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమన్నారు. అతను సింహాద్రి, యంగ్ యమ (యమదొంగ) పాత్రల్లో నటించలేదని, జీవించాడని ఆయన ప్రశంశించారు. నాగార్జున ఇవన్నీ చెప్పకపోయినా ఎన్టీఆర్ అధ్బుతమైన నటుడు అన్న సంగతి ప్రేక్షకులు ఎప్పుడో గమనించి అతన్ని చిన్న వయస్సులోనే పెద్ద స్టార్ ని చేసారు.


Click it and Unblock the Notifications











