బోయపాటి దమ్ముకోసం ఎన్టీఆర్ ఫైట్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని గచ్చిబౌలి సాగుతోంది. ఇక్కడి అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు బోయపాటి జూనియర్ తో అదిపోయే స్టంట్స్ చేయిస్తున్నాడు.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. ఇందులో ఈ హీరో పోలీసు గెటప్ పోషిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ...కొత్త గెటప్ అని మరికొందరంటున్నారు. మరికొన్ని రోజులు అయితే గానీ అసలు విషయం లీక్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. బోయపాటి మాత్రం ఈ సినిమా యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కలగలిపిన వినోదాత్మక చిత్రంగా ఉంటుంది, అభిమానులు కోరుకున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.
దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా...కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శక్తి లాంటి మెగా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా తన పేరును నిలబెట్టే సినిమాగా నిలుస్తుంది జూనియర్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











