జూ ఎన్టీఆర్ మహేష్ బాబుతో పోటి పడలేదంట...!?
జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్నబృందావనం చిత్రం మహేష్ ఖలేజాకు పోటీ కాదని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..'గతకొద్ది రోజులుగా మీడియాలో ఒక్కరోజు తేడాతో పోటీగా వస్తున్న చిత్రాలంటూ రకరకాల కథనాలు రాస్తున్నారు. దయచేసి పోటీ కాదని మనవి చేస్తున్నాను. రజనీకాంత్ 'రోబో"తో కూడా పోటీ కాదు.
జూ ఎన్టీఆర్ చిత్రం జూ ఎన్టీఆర్ దే. ఈ విషయాన్ని గుర్తు చేసుకోండ'ని వేడుకున్నారు. అయితే ఈ నెల 8న విడుదల చేయాల్సిన చిత్రాన్ని సాంకేతిక కారణాల వల్ల 14న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమా మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను వాయిదా వేసినట్లు చెప్పారు. అంతే కాకుండా 'మా బ్యానర్ కు ఎలాంటి ఇమేజ్ ఉందో తెలిసిందే. గతంలో మా బ్యానర్ లో వచ్చిన సినిమాల తరహాలోనే ఈ సినిమాను కథకు ప్రాధాన్యత ఇచ్చాం. ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తారు. పాటలు, ఫైట్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్‌కు 'ఆది" స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెడితే సింహాద్రి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
ఈ సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ సినిమా ఈ ఏడాదిలో వస్తున్న టాప్ త్రీ సినిమాల్లో ఒక సినిమాగా నిలుస్తుంది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది. 2008లో కథను ఎన్టీఆర్ కు చెప్పాం. అప్పటి నుంచి కొత్త మలుపుతో వంశీ తీర్చిదిద్దాడు అన్నారు. మామూలుగా గత చిత్రాలకు రీరికార్డింగ్ 16 రోజులు చేస్తాం. ఈ సినిమాకు సంగీత దర్శకుడు వంశీతో కలిసి 29 రోజులు తీసుకున్నారు. సినిమాకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కెమేరామెన్ ఛోటా కె నాయుడు పనిచేశాడు. దసరా పండుగనాడు సినిమాను విడుదల చేస్తాం"అన్నారు.


Click it and Unblock the Notifications











