ఇది కూడా తుస్.... జూ ఎన్టీఆర్ విషయంలో స్పష్టత!
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ఈచిత్రంలో రాణా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో గోనగన్నారెడ్డి అనే పాత్రను మహేష్ బాబు చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తేలింది.
మహేష్ బాబు వద్దన్న ఆ పాత్రను జూ ఎన్టీఆర్ చేయడానికి అంగీకరించారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలు కూడా ఉత్తి గాలి వార్తలే అని మరోసారి స్పష్టమైంది. జూ ఎన్టీఆర్ స్పోక్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రస్తుతం రభస షూటింగులో బిజీగా ఉన్నారని, మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని, ఆయన ఏ చిత్రంలోనూ గెస్ట్ రోల్ చేయడం లేదని' స్పష్టం చేసారు.

రుద్రమదేవి సినిమా విశేషాల్లోకి వెళితే...గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భారతదేశపు తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రమిది. ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.


Click it and Unblock the Notifications











