twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ స్టామినా గురించి హరీష్ శంకర్ ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు ఏ రేంజిలో అదరగొడతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత కష్టమైన డైలాగైనా, ఎంత పొడవాటి డైలాగైనా అవలీలగా.....సన్నివేశానికి తగిన విధంగా పర్ ఫెక్టుగా చెప్పడం జూ ఎన్టీఆర్ స్టైల్. ఎన్టీఆర్ మెమోరీ పవర్ చూసి ప్రేక్షకులే కాదు...దర్శకులు సైతం ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం.

    తాజాగా 'రామయ్యా వస్తావయ్యా' చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కూడా జూ ఎన్టీఆర్ స్టామినా చూసి అవాక్కయ్యాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ చేసారు. 'జూ ఎన్టీఆర్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్టుతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో పని చేస్తే షూటింగ్ ఆలస్యం అవుతుందనే టెన్షనే ఉండదు. ఆయనది నమ్మశక్యంకాని మెమోరీ పవర్' అంటూ ట్వీట్ చేసాడు.

    'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విడుదల తేదీని మరోసారి స్పష్టం చేసారు దర్శకుడు హరీష్ శంకర్. ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని ట్వీట్ చేసారు. ఆగస్టు నెలలో ఆడియో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

    ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు.

    ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    
 “Working with a Single Take Artist like Young Tiger absolutely there is no tension of getting delayed in shoot..His memory is UNBELIEVABLE”, Director Harish Shankar tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X