ఎన్టీఆర్ కి జంటగా కరీనాకపూర్..ఇది నిజం
హైదరాబాద్: ఎన్టీఆర్ కు జంటగా కరీనాకపూర్ కనిపించనుందా..నిజమే అంటున్నారు. అయితే అది వెండి తెరపై కాదు.. టీవీ తెరపై. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్ధ త్వరలో వజ్రాలకు సంభందించిన కొత్త యాడ్ రూపొందించనుంది. ఆ యాడ్ లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నట్లు సమాచారం.
భారీగా రూపొందుతున్న ఈ యాడ్ కు త్రివిక్రమ్ డైరక్టర్ అని తెలుస్తోంది. ఈ యాడ్ రూపొందిస్తున్నందుకు త్రివిక్రమ్ కి భారీ రెమ్యునేషన్ ముడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ యాడ్ షూట్ జరిగే అవకాసం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్నారు.
సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడి మండువా లోగిలిలో ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
చిత్రం గురింది దిల్ రాజు మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌తో గతంలో తీసిన 'బృందావనం' కంటే భిన్నంగా ఉంటుంది. ఆయన నటన, పాత్ర చిత్రణ అందరికీ నచ్చుతాయి''అని తెలిపారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications











