Devara Advance Booking: ఓవర్సీస్‌లో దేవర రికార్డు కలెక్షన్లు.. అడ్వాన్స్ బుకింగ్‌తో ఎన్ని కోట్లంటే?

జనతా గ్యారేజ్ వంటి క్లాస్ హిట్ తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో కొరటాల సత్తాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనను తాను నిరూపించుకోవాలని కొరటాల శివ కసిగా ఈ సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. దేవర ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ తన క్యారెక్టర్‌‌ వరకు షూటింగ్‌ను రీసెంట్‌గానే పూర్తి చేసుకున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఇటీవల జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా తారక్ ఎడమ చేతి మణికట్టుకు గాయమవ్వడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

Jr NTR koratala siva s Devara advance booking collections going strong within minutes of opening for us premieres

మరోవైపు దేవర బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా ట్రేడ్ సర్కిల్స్ టాక్. ఈ మూవీకి రూ.300 కోట్ల వరకు నిర్మాణ వ్యయం అయినట్లుగా తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే దేవర రూ.125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు వ్యాపారం జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.200 కోట్ల వరకు బిజినెస్ చేసిందట.

నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. శాటిలైట్ రైట్స్ రూ.75 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడైనట్లు ఫిలింనగర్ టాక్. అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని ఈ సినిమా దాదాపు రూ.450 కోట్లకు పైనే బిజినెస్ చేసిందని అంటున్నారు.

సెప్టెంబర్ 27న దేవర రిలీజ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలోనూ దేవర రికార్డులు తిరగరాస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాలో రిలీజ్‌కు 27 రోజుల ముందే ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. బుకింగ్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ చూపిస్తోందంటే దేవర మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా వ్యాప్తంగా 19 లోకేషన్లలో 52 షోలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే హాట్ కేకుల్లో అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఇప్పటి వరకు 76K డాలర్లు వసూలైనట్లుగా టాక్. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటం, యూనిట్ ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలకు దిగితే దేవర ప్రభంజనం ఓ రేంజ్‌లో ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr koratala siva devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X