twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క మాట మాట్లాడని ఎన్టీఆర్:అభిమానుల నిరాశ, తోపులాటలో అభిమానికి గాయాలు

    ఎన్టీఆర్‌ వస్తున్నాడన్న సమాచారంతో ఆలయ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసింది. ఈ క్రమంలో జూనియర్‌ను దగ్గరగా చూసేందుకు అభిమానులు యత్నించడంతో పలుమార్లు తోపులాట చోటు చేసుకుంది.

    |

    జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖమ్మం వస్తున్నారని అభిమానులు పెద్దఎత్తున ఖమ్మంలోని బైపా్‌సరోడ్డు ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్దకు భారీగా చేరుకున్నారు. భద్రాచలం నుంచి తిరుగు ప్రయాణంలో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద కాసేపు ఆగుతారని అక్కడికి చేరారు. అయితే.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఖమ్మం చేరుకున్న జూనియర్‌.. వాహనం నుంచి కిందకు దిగకుండానే వెళ్లిపోయారు.

     అభిమానికి గాయాలు

    అభిమానికి గాయాలు

    ఎన్‌టీఆర్‌ విగ్రహం దాటిన తరువాత ప్రత్యేక బస్సులోని డోర్‌ వద్దకు వచ్చి అభివాదం చేస్తూ వెళ్లారు. దీంతో అభిమానులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. తోపులాటలో ఓ వ్యక్తి కిందపడిపోవడంతో.. ఆటోలోకి ఎక్కించి పోలీసులు ఆసుపత్రికి పంపించారు.

     ఉదయం నుంచి ఆలయం వద్ద

    ఉదయం నుంచి ఆలయం వద్ద

    తొలిసారిగా భద్రాద్రి వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఉదయం నుంచి ఆలయం వద్ద వేచి ఉన్న అభిమానులను పలకరించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన సమయంలో కాసేపు అభివాదం చేయడంతో కొంత ఊరట చెందారు.

    నిరాశకు లోనయ్యారు

    నిరాశకు లోనయ్యారు

    మీడియాతో మాట్లాడకపోవడంతో మీడియా ప్రతినిధులు సైతం నిరాశకు లోనయ్యారు. రామాలయ అభివృద్ధికి విరాళం అడగాలని ఆర్డీవో బి.శివనారాయణరెడ్డి, తహసీల్దారు రామకృష్ణ భావించినా.. ఆయన వద్దకు వెళ్లే పరిస్థితి లేక ప్రయత్నం విరమించుకున్నట్లు సమాచారం.

    జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు

    జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు

    జూనియర్‌ వస్తున్నాడన్న సమాచారంతో ఆలయ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసింది. ఎన్టీఆర్‌ దంపతులు ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే.. జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జూనియర్‌ను దగ్గరగా చూసేందుకు అభిమానులు యత్నించడంతో పలుమార్లు తోపులాట చోటు చేసుకుంది.

     బౌన్సర్లతో వాగ్వివాదం

    బౌన్సర్లతో వాగ్వివాదం

    ఎన్టీఆర్‌ వెంట వచ్చిన బౌన్సర్లు తమ ప్రతాపం చూపడంతో అటు అభిమానులూ.. ఇటు పాత్రికేయులూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకానొక సమయంలో బౌన్సర్లతో పాత్రికేయులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కొందరికి గాయాలయ్యాయని సమాచారం.

    పోలీసుల లాఠీచార్జి

    పోలీసుల లాఠీచార్జి

    అయితే.. పోలీసులు బందోబస్తు వదిలి, ఎన్టీఆర్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ అభిమాన నటుడు ఎంతకీ బయటకు రాకపోవడంతో ఒక్కసారిగా అభిమానులంతా వారు బస చేసిన భవనంలోకి చొచ్చుకురావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు.

    English summary
    NTR and top director Koratala Siva along with their families visited Bhadrachalam today where they will be offering special prayers in Sri Sita Ramachandra Swamy temple in the town.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X