Devara: చేతిలో కత్తి, ఒళ్లంతా రక్తంతో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండగలా 'దేవర' ఫస్ట్ లుక్

సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంలో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు. దీంతో ఎన్టీఆర్ పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగానే సినిమాలు లైన్లో పెట్టాడు తారక్. అందులో ఒకటే దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో తారక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడే దాన్ని ఫిక్స్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా దేవర సినిమా విడుదల తేదీతోపాటు ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు.

JR NTR

దేవర టైటిల్ వస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ రెండో సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ చేతిలో కత్తి, ఒంటినిండా రక్తంతో, సముద్రపు అలల మధ్య రాళ్లపై నిల్చుని దర్శనం ఇచ్చాడు. RRR సినిమాలో కంటే కాస్తా పొడవైన జుట్టుతో ఎన్టీఆర్ ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ చుట్టు పక్కల ఉన్న శవాల గుట్టను చూస్తే పూర్తి వయలెంట్ యాక్షన్ మూవీగా దేవర తెరకెక్కనుందని అర్థం అవుతోంది. మొత్తానికైతే ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది దేవర ఫస్ట్ లుక్. ఇక ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ సాలిడ్ హిట్ కొట్టే ప్రయత్నంగా దేవరను రూపొందించారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమెతోపాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నట్లు టాక్ వచ్చింది.

దేవర సినిమాలో తారక్ ను ఢీకొట్టేందుకు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను విలన్ గా రంగంలోకి దించారు కొరాటల శివ. సైఫ్ కు జోడీగా టీవీ నటి చైత్ర రాయ్ నటిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు ప్రకాష్ రాజ్ కూడా మరో కీ రోల్ ప్లే చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X