Devara Beyond Fest : హాలీవుడ్‌లోనూ దేవర ఫీవర్.. ఎన్టీఆర్ మూవీ అరుదైన ఘనత, రిలీజ్‌కు ముందే సంచలనం !!
కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ దేవర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. రిలీజ్‌కు ముందే దేవర ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దేవర సెన్సార్ సైతం పూర్తయ్యింది. ఈ మూవీకి సీబీఎఫ్‌సీ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో రక్తపాతం కనిపిస్తున్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉన్నా దేవరకు యూ/ఏ రావడం విశేషం. ఇక దేవర రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. అంటే దాదాపు మూడు గంటలు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ దేవర దుమ్మురేపుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దేవర రూ.125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు వ్యాపారం జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి చూస్తే.. దేవర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. శాటిలైట్ రైట్స్ రూ.75 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడైనట్లు ఫిలింనగర్ టాక్. అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని దేవర దాదాపు రూ.450 కోట్లకు పైనే బిజినెస్ చేసిందన్న మాట.
దేవర కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. ప్రతిచోటా రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా అప్పుడే వన్ మిలియన్ కలెక్షన్లు సాధించిన దేవర ఈ ఘనత దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. రిలీజ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండటంతో దేవర ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇదిలాఉండగా.. దేవర మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో దేవరను ప్రదర్శించనున్నారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరగనున్న జానర్ ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్ 'బియాండ్ ఫెస్ట్'లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ మెగా ఫెస్టివల్ జరగనుంది. సెప్టెంబర్ 26న ఈజిప్టియన్ థియేటర్‌లో దేవర ప్రదర్శన జరగనుండగా.. హాలీవుడ్ సెలబ్రెటీలు దేవరను వీక్షించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











