Devara Censor Review: దేవర సెన్సార్ రివ్యూ... టోటల్ రన్ టైమ్ ఎంత, కట్స్ ఇవే ?
కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ దేవర రిలీజ్‌కు దగ్గరపడింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు.
ఇక దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ట్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే దేవర రూ.125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు వ్యాపారం జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి చూస్తే.. దేవర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. శాటిలైట్ రైట్స్ రూ.75 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడైనట్లు ఫిలింనగర్ టాక్. అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని దేవర దాదాపు రూ.450 కోట్లకు పైనే బిజినెస్ చేసిందని అంటున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 10న విడుదలైన దేవర ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఓ వ్యక్తి కాళ్ల దగ్గర బానిసలుగా బతుకుతున్న వారికి అండగా నిలిచే దేవరగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. మరోసారి ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో పాటు డైలాగ్స్ బాగున్నాయి.
రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కొథ, మనిషికి బతికేంత ధైర్యం చాలు.. సంపేంత ధైర్యం కాదు, పని మీద పోయినోడు అయితే పనవ్వగానే వస్తాడు.. పంతం పట్టిపోయాడు నీ కొడుకు వంటి డైలాగ్స్ థియేటర్స్‌లో దద్ధరిల్లిపోతాయని అంటున్నారు. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉందని అర్ధమవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీ సేల్స్ కలెక్షన్స్‌లో 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది.
ఇదిలాఉండగా .. దేవర సెన్సార్ పూర్తయ్యింది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సీబీఎఫ్‌సీ. ట్రైలర్‌లో ఓ రేంజ్‌లో రక్తపాతం కనిపిస్తున్నా యూ/ఏ రావడం విశేషం. అయితే కొన్ని సీన్స్‌కు సెన్సార్ బోర్డ్ కట్ చేసినట్లుగా ఫిలింనగర్ టక్. ఇక దేవర రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. అంటే మూడు గంటలు. ఇంతసేపు ప్రేక్షకుడిని సీట్‌లో కూర్చొబెట్టడమంటే మామూలు విషయం కాదు. అయితే లెంగ్త్ పెరిగినా దేవర ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











