వైరల్ అవుతున్న జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోస్... ఆవిడ వచ్చింది అందుకేనా?
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతితో పాటు ప్రముఖ ఫస్ట్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన జర్సా కూడా ఉండటం గమనార్హం. ఓ ముఖ్యమైన పని నిమిత్తమే ఆమెను పిలిపించినట్లు తెలుస్తోంది.
భావన జర్సా.... ఇండియాలో ప్రఖ్యాత ఫస్ట్ ఇంప్రెషన్ సెలబ్రిటీ ఆర్టిస్ట్. పిల్లలు పుట్టి తర్వాత వారి చిట్టి పాదాలు, చేతులు పోలిన కళాఖండాలు క్రియేట్ చేయడంలో ఎక్స్‌పర్ట్. తమ పిల్లల జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికే ఎన్టీఆర్ దంపతులు ఆమెను పిలిపించినట్లు తెలుస్తోంది.

భార్గవ్ రామ్ ముద్రలు తీసుకున్న భావన జర్సా
ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇటీవలే రెండో కుమారుడు భార్గవ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. భార్గవ్ చిట్టి చేతులు, పాదాలు గుర్తులు కలకాలం గుర్తుండి పోయే జ్ఞాపకాన్ని తయారు చేసేందుకు భావన జర్సాను పిలిపించినట్లు తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన భావన జర్సా
తెలుగు యాక్టర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడు, డాషింగ్, వర్సటైల్ యాక్టర్ జూ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడంతో ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది అని భావన జర్సా తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.

త్వరలో ఇలాంటివి...
ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా భారవ్ రామ్ జ్ఞాపకాలను తయారు చేసి... ఎన్టీఆర్ దంపతులకు అందించబోతున్నారు భావన జర్సా.

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్‌ఆర్' లుక్ అదిరిపోయింది
భావన జర్సా షేర్ చేసిన ఫోటోల్లో ఎన్టీఆర్ లుక్ భిన్నంగా ఉంది. భారీ గడ్డంతో పాటు ఆయన హెయిర్ స్టైల్, ఫేసులో కొత్తదనం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్' కోసమే ఎన్టీఆర్ ఈ లుక్ లోకి మారాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్' రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











