twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు 90వ జయంతిని పురస్కరించుకుని ఆయన సమాధిని సందర్శించారు. పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కొంత సేపు అక్కడే గడిపి తాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

    ఆయన వెంట అనుచరులు తప్ప, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. గత సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొన్న జూనియర్ ఈ సారి మాత్రం అటు వెళ్లలేదు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు జూ ఎన్టీఆర్ స్పందిస్తూ తనకు ఎటువంటి పిలుపు రాక పోవడం వల్లనే తాను వెళ్లలేదని స్పష్టం చేసారు. మరో జన్మ అంటే ఉంటే ఎన్టీఆర్‌కి మనవడిగా పుట్టాలని ఆకాక్షించారు.

    తాత మహా నటుడు అని పేర్కొన్న ఎన్టీఆర్....ఆయన పేరు నిలబెట్టడానికి తన శక్తిమేర ప్రయత్నం చేస్తానని గతంలో పలు సందర్భాల్లో వెల్లడించి సంగతి తెలిసిందే. అదే ఆత్మ విశ్వాసం ఇప్పుడు కూడా జూ ఎన్టీఆర్ ముఖంలో కనిపించింది. అయితే తాత లేని లోటును తలుచుకుని సమాధి వద్ద కాస్త విచారంగా కనిపించారు ఎన్టీఆర్.

    ఫోటోలు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాధిని సందర్శించిన జూ ఎన్టీఆర్

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    జూనియర్ తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి కూడా వచ్చారు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    ఎన్టీఆర్ 90వ జయంతిని పురస్కరించుకని నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ సతీసమేతంగా వచ్చాడు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    మరో జన్మ అంటే ఉంటే ఎన్టీఆర్‌కి మనవడిగా పుట్టాలని ఆకాక్షించారు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    ఆయన వెంట అనుచరులు తప్ప, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. గత సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొన్న జూనియర్ ఈ సారి మాత్రం అటు వెళ్లలేదు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు జూ ఎన్టీఆర్ స్పందిస్తూ తనకు ఎటువంటి పిలుపు రాక పోవడం వల్లనే తాను వెళ్లలేదని స్పష్టం చేసారు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో పాటు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు నివాళులు అర్పించారు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    తాత సమాధి వద్ద విచారంగా కూర్చున్న జూ ఎన్టీఆర్, పక్కనే ఆయన భార్య లక్ష్మీ ప్రణతి.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    తాత ఎన్టీఆర్ సమాధి వద్ద జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    ఎంత బిజీ షూటింగుల్లో ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం జూ ఎన్టీఆర్ తప్పకుండా ఘాట్ ను సందర్శిస్తుంటారు. తనకు ఈ జన్మ, ఈ హోదా రావడానికి ప్రధాన కారణం తాతయ్యే అని ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో వెల్లడించారు.

    జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి @ఎన్టీఆర్ ఘాట్(ఫోటోలు)

    ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణం, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

    English summary
    Young Tiger Jr NTR on Tuesday said that he has not received an invite to attend TDP's annual event Mahanadu.
 On the occasion of his grandfather late Nandamuri Taraka Rama Rao's birth anniversary, NTR along with his wife visited the NTR ghat and paid homage to him. Speaking to the media, Jr NTR said that he wished to be born in NTR's family in next birth too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X