జూ ఎన్టీఆర్ లక్కు కిక్కు...(ఫోటోలు)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'లక్కు కిక్కు' గేమ్ షోను బుధవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ సన్నిహితుడు, స్నేహితుడు అయిన రాజీవ్ కనకాల 'కె. సుమరాజీవ్ క్రియేషన్స్' పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఈ బేనప్‌పై తొలిసారిగా 'లక్కు కిక్కు' అనే టీవీ గేమ్ షోను కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా 'కె. సుమరాజీవ్ క్రియేషన్స్' బేనర్ లోగోను ఎన్టీఆర్ ఆవిష్కరించారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు వివి వినాయక్ 'లక్కు కిక్కు' షో టైటిల్ సాంగ్‌ను విడుదల చేయగా, హీరో శ్రీకాంత్, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిలు టైటిల్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ.... రాజీవ్ కనకాల తనకు ఎంతో సన్నిహితుడని, నా కుటుంబ సభ్యుడితో సమానమని చెప్పుకొచ్చారు. నిర్మాతగా రాజీవ్ కనకాల విజయవంతం కావాలని ఆకాక్షించారు. అదే విధంగా వివి వినాయక్, శ్రీకాంత్, శ్యాంప్రసాద్ రెడ్డి, నటుడు మురళీ మోహన్‌లు సుమ, రాజీవ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
'లక్కు కిక్కు' గేమ్ షో త్వరలో జీతెలుగు ఛానల్లో ప్రసారం కానుంది. ఈకార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి సంగీతం సామవేద్, లిరిక్స్ బాలాజీ, ఆర్ట్: మురళి, నిర్మాత: రాజీవ్ కనకాల, దర్శకత్వం: సంజయ్ నాదుల తదితరులు.

కె. సుమరాజీవ్ క్రియేషన్స్ బేనర్ లోగోను ఆవిష్కరిస్తున్న జూ ఎన్టీఆర్.

లక్కు కిక్కు టైటిల్ సాంగును ఆవిష్కరిస్తున్న వివి వినాయక్.

టైటిల్ లోగోను ఆవిష్కరిస్తున్న శ్రీకాంత్, శ్యాంప్రసాద్ రెడ్డి.

సుమపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి జూ ఎన్టీఆర్ క్లాప్

కార్యక్రమానికి హాజరైన జూ ఎన్టీఆర్, వివి వినాయక్, మురళీ మోహన్, శ్యాంప్రసాద్ రెడ్డి, సుమరాజీవ్ దంపతులు, వారి పిల్లలు.


Click it and Unblock the Notifications











