గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న జూ ఎన్టీఆర్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్చుకునే పనిలో ఉన్నాడు. హైదరాబాదులోని పోలో అండ్ హార్స్ రేసింగ్ క్లబ్బులో గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నాడు. త్వరలో ఓ మేలిమి గుర్రాన్ని కొనాలనే ఆలోచన కూడా ఉందట జూనియర్‌కి. ఇప్పుడు ఖరీదైన గుర్రాన్ని కలిగి ఉండటం స్టేటస్ సింబల్. గుర్రపు స్వారీ నేర్చుకుంటే సినిమాల్లోనూ అలాంటి సీన్లు చేయడానికి వీలుగా ఉంటుందిగా...
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్న 'రభస' చిత్రం చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ సమంతే.
దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి హరికృష్ణ హీరోగా వచ్చిన 'సీతయ్య'కు సీక్వెల్‌గా రూపొందించే 'ఎవరి మాట వినడు' అనే సినిమాలో జూ ఎన్టీఆర్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సీతయ్యకు సీక్వెల్ తీస్తానని ప్రకటించడం వెనక అసలు కారణం....జూ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ఉద్దేశ్యమే అని, హరికృష్ణ తనయుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ 'ఎవరి మాట వినడు' చిత్రంలో నటిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైవిఎస్ భావిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే జూ ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












