»   » వారెవా.. ఎన్టీఆర్ డెడికేషన్ అంటే ఇది.. యమదొంగ తరువాత మళ్లీ, 3 నెలల్లోనే 20 కేజీలు!

వారెవా.. ఎన్టీఆర్ డెడికేషన్ అంటే ఇది.. యమదొంగ తరువాత మళ్లీ, 3 నెలల్లోనే 20 కేజీలు!

Subscribe to Filmibeat Telugu
Jr NTR To Lose Weight For Trivikram And Rajamouli Films

నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటన, డాన్సులతో ఎన్టీఆర్ ప్రత్యేకమైన క్రేజ్ ని, భారీగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ చివరగా నటించిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం యంగ్ టైగర్ త్రివిక్రమ్ మరియు రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలుగు వర్షన్ ఐపీఎల్ ప్రమోషన్ సదర్భంగా ఎన్టీఆర్ కొత్త లుక్ ఆకర్షించింది. తదుపరి చిత్రాల కోసమే ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. ఎన్టీఆర్ నయా లుక్ గురించి షాకింగ్ న్యూస్ ని బయట పెట్టాడు.

జోరు మీద ఉన్నా యంగ్ టైగర్

జోరు మీద ఉన్నా యంగ్ టైగర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ వరుసగా విజయాలు దక్కించుకుంటూ జోరు కొనసాగిస్తున్నాడు.

ఇద్దరు బడా డైరెక్టర్లతో

ఇద్దరు బడా డైరెక్టర్లతో

జై లవకుశ చిత్రంతో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత త్రివిక్రమ్, రాజమౌళి వంటి బడా డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం ప్రారంభం కాబోతోంది.

త్రివిక్రమ్ సినిమా కోసం సరికొత్త లుక్

త్రివిక్రమ్ సినిమా కోసం సరికొత్త లుక్

త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ప్రేమ కథగా రూపొందనునట్లు తెలుస్తోంది. దీనితో బరువు తగ్గాలని ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ సూచించాడట. ఆమద్యన ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

షాకిచ్చిన ఎన్టీఆర్

షాకిచ్చిన ఎన్టీఆర్

ఇటీవల ఐపీఎల్ తెలుగ వర్షన్ ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ లుక్ అందరిని ఆకర్షించింది. ఓ జాతీయ మీడియాతో ఎన్టీఆర్ మూడు నెలల్లోనే 20 కేజీలు బరువు తగ్గినట్లు వెల్లడించాడు. అది అభిమానులకు నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం.

యమదొంగ తరువాత మళ్ళీ

యమదొంగ తరువాత మళ్ళీ

ఎన్టీఆర్ గతంలో యమదొంగ చిత్రం కోసం భారీ స్థాయిలో బరువు తగ్గాడు. యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ ని రాజమౌళి స్టైలిష్ లుక్ లో చూపించాడు. కాగా త్రివిక్రమ్ చిత్రం కోసం ఇప్పటికే 20 కేజీల బరువు తగ్గినట్లు చెప్పిన ఎన్టీఆర్ ఇంకా తగ్గుతానని అంటున్నాడు.

సులభం కాకపోయినా

సులభం కాకపోయినా

ఇంకా బరువు తగ్గడం అంత సులువు కాదు. రాజమౌళి కూడా ఎన్టీఆర్ ని జిమ్ లో వర్కవుట్ చేయమని సూచించారట. దీనితో ఎన్టీఆర్ ప్రత్యేకమైన డైట్ పాటిస్తూ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. సినిమాపై ఎన్టీఆర్ కు ఉన్నా డెడికేషన్ అటువంటిది అని అభిమానులు అంటున్నారు. తదుపరి చిత్రాల్లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో అభిమానులు చూడవచ్చు.

English summary
Jr NTR loses 20kg in 3 months. He is trying new makeover for Trivikram and Rajamouli films
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X