»   »  జూ ఎన్టీఆర్ సినిమా తెలుగులో ప్లాపైనా...అక్కడ అదరగొడుతోంది!

జూ ఎన్టీఆర్ సినిమా తెలుగులో ప్లాపైనా...అక్కడ అదరగొడుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ తెలుగులో టాప్ స్టార్ హీరోల్లో ఒకరు. ఎన్టీఆర్ సినిమాలకు డిమాండ్ కేవలం తెలుగుతో పాటు కాస్తో కూస్తో సౌత్‌లో ఉంటుందని మాత్రమే చాలా మంది భావిస్తుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నార్త్‌లో ఎన్టీఆర్‌ సినిమాలకు ఆదరణ భారీగానే ఉంటోంది.

శక్తి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయన్ను చూసేందుకు చాలా జనం వచ్చారు. అందుకు కారణంగా ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి టీవీల్లో ప్రసారం అవుతుంటాయి. అందుకే ఆయనకు అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆయన సినిమాలను హిందీలో డబ్ చేసి డైరెక్టుగా థియేటర్లలో విడుదల చేయాలనే అభిమానులు కూడా ఉన్నారు.

 Jr NTR Mar Mitenge 2 TRP rating

ఆ సంగతి పక్కన పెడితే తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఇక్కడ భారీ పరాజయం చవిచూసింది. ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజుకు నష్టాలే మిగిలాయి. దీంతో శాటిలైట్ హిందీ డబ్బింగ్ రైట్స్ చాలా తక్కువ ధరకే నార్త్ ఇండియన్ బిజినెస్‌మేన్‌కు అమ్మారు దిల్ రాజు.

ఈ సినిమాను హిందీలో ‘మార్ మిటేంగే 2' పేరుతో గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ బేనర్లో టీవీల్లో విడుదల చేసారు. గత వారాంతం ఈ సినిమా సోనీ సెట్ మాక్స్‌లో విడుదలై అత్యధిక టీఆర్‌‍పి రేటింగును సొంతం చేసుకుంది. ఇతర టీవీ కార్యక్రమాలు, సినిమాల టీఆర్‌పి రేటింగులను అధిగమించింది. గత వారాంతం నమోదైన టాప్ 5 టీఆర్పీ రేటింగ్స్ లిస్టులో ‘మార్ మిటేంగే 2' స్థానం దక్కించుకుంది.

English summary
Jr NTR's Telugu film Ramayya Vasthavayya directed by Harish Shankar and produced by Dil Raju saw a disastrous result here. Dil Raju sold Hindi dubbing rights and satellite rights of this movie for a negligible price to one of a North Indian businessman. Later on Ramayya Vasthavayya was dubbed under the name of Mar Mitenge 2 on Goldmines Telefilms banner to provide good profits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu