తారకరాముని కల్యాణంకై హైటెక్స్‌లో భారీగా ఏర్పాట్లు..విశేషాలు
హైదరాబాదులో జరుగనున్న జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహమహోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన అభిమాని కె.వి.ఎ.రామారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కొబ్బరి బొండాలను పంపారు. వధూవరుల పేర్లతో అందంగా తీర్చిదిద్దిన వీటిని రాజమండ్రికి చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ నెక్కంటి రామ్మోహనరావు ద్వారా బుధవారం హైదరాబాదు పంపించారు. వివాహ విందులో వడ్డించే పనసపొట్టుకూర, దోసకాయ ఆవకాయ తయారీకి కొత్తపేటకు చెందిన వంట బ్రాహ్మణుడు మంగిపూడి ఉదయభాస్కరశర్మకు అవకాశం లభించింది. సుమారు 12వేల మందికి సరిపడేలా ఈ వంటకాలను తయారు చేస్తున్నట్లు శర్మ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వివాహానికి మండపేటకు చెందిన జి.ఎస్.భగవాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వరుడు జూనియర్ ఎన్టీఆర్. వధువు నార్నె వారి ఇంటిపడుచు. వేదిక హైదరాబాద్‌లోని హైటెక్స్ సుముహూర్తం.గురువారం అర్థరాత్రి 2.41 గంటలు (తెల్లవారితే శుక్రవారం).శుభస్తు..శీఘ్రం.


Click it and Unblock the Notifications











