జూ ఎన్టీఆర్ వివాహా భోజనంబు ఎక్కడంటే...!?
ఈ యేడాది జరిగిన వేడకల్లో, జరగబోయే వేడుకల్లో జూ ఎన్టీఆర్ పెళ్ళి ఖచ్చితంగా ఓ మంచి ఈవెంట్ గా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. తమ అభిమాన హీరో పెళ్ళి వేడుకల్లో తాము కూడా పాలు పంచుకోవాలని నందమూరి అభిమానులు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా తన జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన వేడుక పెళ్ళి కాబట్టి..ఇందులో తన అభిమానులను కూడా పాల్గొనేలా చేస్తే బావుంటుందని భావిస్తున్నాడట.
కాగా అభిమానుల కోసం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తన వివాహ విందును ఏర్సాటు చేయాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. దీనికి భారీగా ఖర్చు అవుతుందని, ఈ ఖర్చుని ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు భరించడానికి సిద్ధపడుతున్నాడని తెలుస్తోంది. మరో వైపు 2014లో జరగబోయే ఎలక్షన్స్ కోసం టిడిపి తరపున నార్నే శ్రీనివాసరావు భారీగా ఖర్చు పెట్టడానికి అమౌంట్ ఏర్సాటు చేసుకుంటున్నాడట.
ఇప్పుడు ఎన్టీఆర్ పెళ్ళికి...అప్పుడు ఎలక్షన్స్ కి..ఇంత భారీ మొత్తంలో నార్నే ఖర్చు పెట్టాడానికి ఫండ్స్ ఏర్సాటు చేసుకోగలుగుతాడా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయట. సో..నార్నేనిర్ణయాన్ని బట్టి అభిమానులకు ఎన్టీఆర్ వివాహ విందు ఉంటుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











