»   » జూ ఎన్టీఆర్ పెళ్లి వాయిదా వేశాడా!??

జూ ఎన్టీఆర్ పెళ్లి వాయిదా వేశాడా!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివాహం వాయిదా పడింది! అసలు జూనియర్ పెళ్లి నిశ్చయమే కాలేదు..వాయిదా పడటమేంటనుకుంటున్నారా? అదేనండీ ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. జూనియర్ మైనారిటీ తీరని లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంలూ కొందరు రచ్చరచ్చ చేశారు కూడా.

అసలు ఈ గొడవలేమి జరుగకుంటే మార్చిలో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ వివాదాల నేపథ్యంలో జూనియర్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలనాటికి లక్ష్మిప్రణతి మైనారిటీ తీరుతున్నా మరో ఏడాది కాలం ఆగిన తర్వాత వివాహం చేసుకోవాలని జూ ఎన్టీఆర్ నిశ్చయించుకున్నాడట. జూనియర్ ప్రతిపాదనకు లక్ష్మిప్రణతి తండ్రి, 'ఎన్ స్టూడియోస్" అధినేత శ్రీనివాస్ రావుతో పాటు పెళ్లి పెద్ద చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu