18కోట్లతో వెలసిన కళ్యాణమండపంలో జూ ఎన్టీఆర్ కళ్యాణం కమనీయం...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పెళ్లి ఏర్పాట్లు అత్యంత ఉన్నత స్థాయిలో..ఎవరూ ఊహించనంతగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి..మే 5న జరగనున్న 'జూ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి"ల వివాహమహోత్సపు వేడుకలు..ఇప్పటి వరకు ఎక్కడా ..జరగనట్లుగా చేసేందుకు నందమూరి-నార్నే కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ వేడుకలు ఏలా ఉన్నాయో..మచ్చుకకు కొన్ని..మే5న రాత్రి హైటెక్ లో ఎన్టీఆర్ -లక్ష్మీప్రణతిల వివాహం జరుగనుంది. ఈ వివాహపు మహోత్సపు వేడుక (కళ్యాణ్ మండపం)సెట్ సుమార్ 18కోట్ల రూపాయలతో రూపొందించినట్టుగా సమాచారం.
అలాగే నందమూరి అభిమానుల కోసం ప్రతి ఒక్క జిల్లా నుండి 150మందికి ఆహ్వానంతో పాటు వారందరికీ వోల్వో బస్సులను ముందుగానే బుక్ చేయించడం విశేషం. రీసెంట్ గా జరిగిన బన్నీ మ్యారేజ్ లో అభిమానులు, విఐపిలు పడిన ఇబ్బందిని గమనించిన నందమూరి -నార్నేఫ్యామిలీలు..అభిమానుల కోసం, విఐపిల కోసం హైదరాబాద్ లోని 4మెయిన్ హోటల్స్ ను బుక్ చేయించడంతో పాటు వారందరికీ కళ్యాణ మండపం దగ్గరకు వచ్చేందుకు సెపరేట్ గా దారులు రూపొందించడం విశేషం. అలాగే హరికృష్ణతో కలిసి జూ ఎన్టీఆర్ తన పెళ్లికి అందర్నీ ఆహ్వానించడం విశేషం. ఎన్టీఆర్ -లక్ష్మీ ప్రణతిల వివాహపు శుభలేఖ సుమారు 3వేల రూపాయలని తెలిసింది. ఇంకా ఎన్నో విశేషాలతో ఎన్టీఆర్ తన వివాహాన్ని నింపుకోవడం..నిజంగా నందమూరి అభిమానులకు ఎంతో ఆనందమైన విషయమే..


Click it and Unblock the Notifications











