పెళ్లి విషయంలోనూ తాతబాటలోనే నడుస్తున్న జూ.ఎన్టీఆర్..!?
గత ఏడాది రికార్డు స్థాయి కలెక్షన్లతో అదరగొట్టిన అరుంధతి సినిమాలో అనుష్క ఇంట్రడక్షన్ సీన్ లో అరుంధతి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె వివాహం జేజమ్మ వివాహం రెండూ ఒకే రోజున జరుగుతుండటంతో జేజమ్మే మళ్లీ అరుధతిగా పుట్టింది అని చంద్రమ్మ చెప్పడం జరుగుతుంది. అదే వషయాన్ని నిజం చేస్తూ అరుంధతే జేజమ్మ అని అర్థమవుతుంది.
ఇప్పుడు ఇదే విధంగా జూ ఎన్టీఆర్ విషయంలో కూడా జరగబోతోంది. తన తాతయ్య మహానటుడు ఎన్టీ రామా రావు గారి పోలికలను పుణికిపుచ్చుకున్న జూ ఎన్టీఆర్ వివాహం తన తాతగారి వివాహం రోజునే జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలి కాలంలో చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారిన జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహం తన తాతగారయిన ఎన్టీఆర్, బసవతారకంల పెళ్లి జరిగిన మే 21వ తారీఖునే జరగనుందని సమాచారం. తాతగారి పోలికలనే కాకుండా అన్నింటిలోనూ తాతగారిని అనుసరిస్తున్న ఎన్టీఆర్ ఆయనంత గొప్పవాడు కావాలని కోరుకుందాం..!!


Click it and Unblock the Notifications











