జూ ఎన్టీఆర్ మాస్ మాయాజాలం.. ‘ఊసరవెల్లి’
జూ ఎన్టీఆర్ హీరోగా సురేందర్‌డ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి 'ఊసరవెల్లి" అనే టైటిల్ పరిశీలనలో వున్న విషయం తెలిసిందే. . శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్‌ఒకపార్ట్ ను జరుపుకుంటోంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'జూఎన్టీఆర్ అభిమానులను అలరించేలా పవర్‌ఫుల్ మాస్ కథాంశంతో అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. జూ ఎన్టీఆర్, తమన్నాలతో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా 32 రోజుల పాటు తొలి షెడ్యూల్ జరిపాము. ఇందులో జూ ఎన్టీఆర్ పాత్ర చిత్రణ పవర్‌ఫుల్ గా వుంటుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం ప్రధానాకర్షణగా వుంటుంది.
'అశోక్" తర్వాత సురేందర్‌డ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వారి అంచనాలను అందుకునేలా వుంటుందీ చిత్రం. ఏప్రిల్ 16న రెండో షెడ్యూల్ ప్రారంభించి నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతున్నాం. నెక్స్ట్ వీక్ లో జూలై 23 నుండి జూలై 30 వరకు ముంబాయ్ తర్వాతి చివరి షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, విదూత్ జమ్వాల్, అద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, అలీ, జయవూపకాష్‌డ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సినిమాటోక్షిగఫీ: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రవిందర్, సమర్పణ: భోగవల్లి బాపినీడు.


Click it and Unblock the Notifications











