జూ ఎన్టీఆర్ క్రియేట్ చేయనున్న 'ఊసరవెల్లి' వండర్స్...!
రేపు విజయదశమి రోజున తన 'ఊసరవెల్లి' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఓపక్క టెన్షన్ తోనూ, మరోపక్క నమ్మకంతోనూ వున్నట్టు యన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఇందులో అభిమానులకు ఓ కొత్త యన్టీఆర్ కనిపిస్తాడని ఆయన అంటున్నారు. 'ఏదో ప్రేక్షకులను మెప్పించడానికంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం, అనవసరంగా భారీ ఫైట్స్ చేయడం ఇందులో మీకు కనిపించవు. ప్రతి అంశమూ కథలో భాగంగా వుంటుంది" అంటున్నాడు యన్టీఆర్.
'నా సినిమాల ట్రెండ్ 'అదుర్స్' సినిమా నుంచి మారింది. అందులోని చారి పాత్ర నా మీద నాకు నమ్మకం పెరిగేలా చేసింది. డిఫరెంట్ కథలు చేయచ్చన్న కాన్ఫిడెన్స్ ఈ సినిమా వల్ల కలిగింది. ఆ బలంతోనే 'బృందావనం' సినిమాలో లవర్ బాయ్ గా నటించాను. ఇప్పుడీ రెండు సినిమాల వల్లే 'ఊసరవెల్లి' చేయగలిగాను. ఒక పక్కా కమర్షియల్ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి కొత్త తరహాలో తీశాడు. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుంది" అన్నాడు యంగ్ టైగర్.
హీరోగా ఎన్టీఆర్ కే ఇన్నిహోప్స్ ఉంటే మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి వారికి పండేగే పండగ, ఈ సారి కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తోందుని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 'ఊసరవెల్లి' సినిమా పట్ల టాలీవుడ్ లో పాజిటివ్ రిపోర్ట్ వుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్లకి పైగా విడుదల అవుతున్న 'ఊసరవెల్లి" ఘన విజయం సాధించి 'మరోసారి" తెలుగు ఇండస్ట్రీకి పేరు తీసుకొస్తుందని ఇండస్ట్రీలోని పెద్దలందరూ ఎదురుచూస్తున్నారు.!


Click it and Unblock the Notifications











