ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ కారణం హీరోయిన్నా..డాన్సా....?!
'ఊసరవెల్లి" చిత్రం సెకెండాఫ్ లో హీరోయిన్ తమన్నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇదే ఈ సినిమాకి చాలా మైనస్ అయ్యిందని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ అభిమానులు కూడా హీరోయిన్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం.ఈ పాత్ర వచ్చినప్పుడు ఎన్టీఆర్ కనిపించకపోవడం అసలు జీర్ణించుకోలేకపోయారట. అలానే ఈ సినిమాలో డ్యాన్స్ లు తక్కువగా ఉండటం కూడా సినిమాకి మైనస్ అయ్యిందని భావిస్తున్నారట. దాంతో ఎన్టీఆర్ ఇక తదుపరి సినిమాల్లో ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన తదుపరి చిత్రాల దర్శకుల దగ్గర చెప్పి స్క్రిప్ట్ విషయంలో కేర్ తీసుకుంటున్నాడని సమాచారం.
కాగా వచ్చే యేడాది ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను నటుడు నిర్మాత గణేష్ బాబు నిర్మించనున్నాడు. కాగా ఈ సినిమాల్లో ఏదో ఒక సినిమాలో ఇలియానాని ఎన్టీఆర్ సరసన నటింపజేయడానికి ప్రయత్రాలు చేసాడట గణేష్. కానీ ఇలియానా వద్దని ఎన్టీఆర్ ఖరాఖండిగా చెప్పేసాడని సమచారం. ఇలియానాకు బదులు కాజల్ ఓకే అన్నాడట. కాగా ఎన్టీఆర్ నటించబోయే రెండు చిత్రాల్లో ఏదో ఓ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











